కల్లూరు మండలం చెన్నూరు లో యూరియా కోసం నిరసన తెలిపారు అనే నెపంతో రైతులు పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలితెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కల్లూరు రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందించాలి అని కోరిన రైతులు పై కల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం చెన్నూరు సోసైటి కార్యాలయం లో మరియు యాజ్ఞ నారాయణపురం కేంద్రాల్లో యూరియా పంపిణీ రైతు సంఘం బృందం పరిశీలించింది,భారీ క్యూ లైన్లో ఉన్న రైతులతో మాట్లాడారు.మండలం లో యూరియా సరఫరా వివరాలు మండల వ్యవసాయ అధికారి రూపా తెలుసుకున్నారు