గత వైసిపి పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు ఎరువులు పంపిణీ చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను రోడ్లపై క్యూ లైన్ లో నుంచో పెడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన 'అన్నదాత పోరు' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివెళ్లి ఆర్టీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.