రాబోవు గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు శనివారం మూడు గంటల సమయంలో మాగనూరు ఎంపీడీవో కార్యాలయంలో అన్ని మతస్తుల పెద్దలు ఉత్సాహ కమిటీ సభ్యులు ఆర్గనైజర్లు ప్రజాప్రతినిధులు మండల అధికారులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగనూరు ఎస్సై అశోక్ బాబు మాట్లాడుతూ రాబోయే పండుగలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా తమ పండగలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని సూచించారు.