చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి గాంధీ రోడ్ లోని జిల్లా సహకార వ్యవసాయ గిడ్డంగి దగ్గరికి చేరుకున్న రైతులు శుక్రవారం ఉదయం నుంచి సబ్సిడీ యూరియా కోసం బారులు తీరారు అయితే తమ తమ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అందుబాటు లేకపోవడంతో పంట నష్టపోతామని సుదూర ప్రాంతాల నుండి చిత్తూరుకి రైతులు ఇక్కడికి చేరుకున్నట్టు రైతులు తెలిపారు ప్రభుత్వ అధికారులు మండలాల్లో ఎరువులు కొరత లేకుండా చూడాలని వారు కోరుతున్నారు