అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని CITU జిల్లా అధ్యక్షుడు దావుద్ అన్నారు. నేడు సోమవారం ఆశ కార్యకర్తలు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారన్నారు. ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని, ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు చెల్లించాలన్నారు. పండగ సెలవులు నిర్ణయించి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.