భూపాలపల్లి మండలం గుడాడిపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం 9 గంటలకు వృద్ధులు, వికలాంగులు వితంతులతో సమావేశం నిర్వహించినట్లు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకుడు నోముల శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వృద్ధులకు 4000 రూపాయల పింఛన్ వికలాంగులకు 6000 ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని దీనిని నిరసిస్తూ రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వృద్ధులు ,వికలాంగులు,వితంతువులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.