కల్లూరు అర్బన్ 19వ వార్డులో కెవిపిఎస్ ఆవిర్భావ 28వ దినోత్సవ వేడుకలు రాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. సోమవారం నగర నాయకులు జి.యేసు రాజు, ఎం.భాస్కర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో అంటరానితనం నిర్మూలనకు పోరాటం చేస్తోందని తెలిపారు. అక్టోబర్ 2, 1998 నుంచి నిరంతర పోరాటాలతో ప్రయాణం కొనసాగిందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పి.నాగరాజు, జయరాజు, ఆర్.పెద్దబాబు, రాధాకృష్ణతో పాటు అనేక మంది పాల్గొన్నారు.