తుని పట్టణానికి స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకున్నాయి. శుక్రవారం తుని మండల ఎమ్మార్వో కార్యాలయంలో ఈ కార్డుల పంపిణీపై రేషన్ డీలర్లకు ఎమ్మార్వో జీవీఎస్ ప్రసాద్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – డీలర్లు ప్రత్యేక సివిల్ సప్లై యాప్ ద్వారా స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. సాంకేతిక సౌకర్యాలతో కూడిన ఈ కార్డులు లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా సౌకర్యాలు అందించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు.తరువాత డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ స్మార్ట్ కార్డులను డీలర్లకు అందజేశారు.