Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణాన్ని ఆనుకుని ఉన్న నెలిపర్తి లేఔట్ లో మట్టి రోడ్డును కాలనీవాసులు చందాలు వేసుకుని నిర్మించుకున్నారు. చినుకు పడితే కాలనీ లేఅవుట్ లోనికి కాలు కూడా పెట్టేందుకు వీలు లేదంటూ పలుమార్లు అధికారులను కోరినా, ప్రయోజనం లేకపోవడంతో ప్రస్తుతం కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబాల నుండి వెయ్యి నుండి 5వేల రూపాయల వరకు చందాలు వేసుకుని మట్టి రోడ్డు వేయించినట్లు కాలనీవాసులు తెలిపారు.