దేవనకొండ మండలం వెలమకూరు రెవెన్యూ పరిధిలో మంగళవారం ఉదయం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దూదెకొండ, కోతిరాళ్ల గ్రామాలకు ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ సిబ్బంది స్పష్టం చేశారు.