వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రాష్ట్ర మాజీ మంత్రి రఘువీరారెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన కూడా కంటతడి పెట్టారు. అజాతశత్రువుగా తన సన్నిహితుడుగా సుపరిచితుడైన భాస్కర్ రెడ్డి మృతి చాలా బాధాకరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జడ్పీ మాజీ చైర్ పర్సన్ తోపుదుర్తి కవితను ప్రత్యేకంగా ఓదార్చారు.