క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 15న ఢిల్లీలో జరగనున్న సర్పంచుల సదస్సుకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ సర్పంచ్ కీర్తి హరనాథ్ బాబుకు ఆహ్వానం అందింది. జలశక్తి మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 75 మంది సర్పంచులు ఎంపికయ్యారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై తన అనుభవాలను ఆయన పంచుకోనున్నారు.