చిలకలూరిపేటలో కొత్తగా విద్యుత్తు సబ్ డివిజన్ ఏర్పాటు చేసి అందులోకి నకరికల్లు రొంపిచర్ల ఈపూరు శావల్యాపురం మండలాలను చేర్చడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన నరసరావుపేట పట్టణంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3:00 సమయంలో మీడియా తో మాట్లాడుతూ ఈ మార్పు వల్ల వినియోగదారులకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. దీనిపై విద్యుత్తు ఎసి ఈ కి వినతిపత్రం అందించి అవసరమైతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.