ప్రపంచ భాషలలో తెలుగు భాష ఔన్నత్యం వెలకట్టలేనిదని బీసీ హాస్టల్స్ సంక్షేమ అధికారి వెంకటేశ్వరరావు, సాహితీవేత్త రచయిత సత్యనారాయణ రాజు అన్నారు. భీమవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు తెలుగుభాషా గొప్పతనంపై వ్యాసరచన పోటీలు, ర్యాలీ నిర్వహించారు. తెలుగువారిగా తెలుగు భాషను ఆదరించినప్పుడే తెలుగు జాతి గొప్పతనం లోకంలో తెలుస్తుందని, భావవ్యక్తీకరణకు భాష అవసరమని అన్నారు.