గణేష్ నిమజ్జన ఉత్సవాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి పర్యవేక్షించారు. శుక్రవారం రాత్రి నిమజ్జన ప్రాంతాలైన కొత్తపల్లి, మానకొండూరు చెరువులను, చింతకుంట కెనాల్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొత్తపల్లి, మానకొండూర్ చెరువుల వద్ద, చింతకుంట కెనాల్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పర్యవేక్షించి క్రేన్ సహాయంతో కొన్ని విగ్రహాలను స్వయంగా నిమజ్జనం చేశారు. రెవిన్యూ, పోలీస్, మునిసిపల్ తదితర అధికారులు సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత అధికారుల సహకారం ఉంచాలన్నారు.