కోడుమూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ బైకు చోరీకి గురైంది. బాధితుడు బాష తెలిపిన వివరాల మేరకు గురువారం రాత్రి టీ తాగేందుకు వెళ్లిన బాష కొంత సమయం తర్వాత వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై పరిసరాల్లో వెతికాడు. అయినా ఫలితం లేకపోయింది. స్నేహితుల సాయంతో సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ దుండగుడు బైక్ ను తస్కరించిన దృశ్యం కనిపించింది. దీంతో శుక్రవారం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.