దేశంలో వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన పాలకోడేరులో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన విసాల సహక పరపతి సంఘం బ్యాంకు చైర్మన్గా నియమితులైన కొత్తపల్లి నాగరాజు ప్రమాణ స్వీకారం సభలో అయినా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూడా ఈ రంగం అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు.