ఎట్టకేలకు కృష్ణమ్మ తల్లి శాంతించింది. గత 12 రోజులుగా వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో నాగార్జునసాగర్ డ్యాం నుంచి భారీగా వరద నీరు దిగుకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎగువు నుంచి నాగార్జునసాగర్ కు వచ్చే వరద నీరు తగ్గడంతో 18 గేట్ల నుంచి దిగుకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 585 అడుగులు చేరింది.