ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో బిజెపి ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క యోగేశ్వర్ ఆధ్వర్యంలో అమరావతిలో సెప్టెంబర్ 17వ తేదీ జరుగు విశ్వకర్మ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంచ వృత్తుల వారిని ఆహ్వానించినట్లు తెలిపారు. అంతర్జాతీయ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంతో మహాసభలో విశ్వకర్మ చరిత్ర ప్రదర్శన ఉత్పత్తుల ప్రదర్శన చరిత్రకారుల స్మరణ విశ్వకర్మ సభ శోభయాత్ర వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.