ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.గ్రామంలో అపరిశుభ్రత పేరుకు పోవడంతో వీధుల్లోని చెత్తను గ్రామపంచాయతీ కార్యాలయంలో వేసి ఆందోళన చేపట్టారు.గతంలో జిల్లాలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా ఉన్న గ్రామం నేడు చెత్తా చెదారం తో నిండిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.