మార్వాడీల గో బ్యాక్ నినాదం దారుణమని, వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా గృహ బహిష్కరణ కూడా చేయాలని ప్రజాపక్షం కన్వీనర్ దేశం రెడ్డి బలరాం నాయుడు అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ, నగరంలోని ప్రజలకు మార్వాడీలతో విడదీయరాని బంధం ఉందని, అటువంటి వారిని టిడిపి నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.