కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం నిర్మించిన పార్కులకు తాళం వేసేయడం దారుణమని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఎరిగిరేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని ఓపెన్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఒక కోటి 1.7 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పార్కుకు తాళం వేయడం ఏమిటి? నగర మధ్యలో ఉన్న పార్కు ఇలా ఉంటే, ఇతర ప్రాంతాల్లోని పార్కుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి” అని ప్రశ్నించారు.తక్షణమే కమిషనర్ అన్ని పార్కులను పరిశీలించి అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల