నార్సింగి మండల కేంద్రంలోని కాసింపల్లి చెరువుకు గురువారం మధ్యాహ్నం గండిపడింది. గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండుకుండగా మారగా గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి చెరువు తూముకు గండిపడడంతో చెరువులోని నీరు వృథాగా పోతుంది. వారం రోజులుగా చెరువు నీరు పోతున్న భారీ వర్షాలతో తూము గండిని ఎవరు గమనించలేదు. గురువారం చెరువు కింద పంట పొలం వద్దకు వెళ్లిన రైతు గమనించి గ్రామ పెద్దల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వెంటనే స్పందించి తూము గండికి మరమ్మతులు చేపట్టాలని లేకుంటే చెరువులోని నీరు మొత్తం పోతుందని చెరుకు కింద ఉన్న పంట పొలాలు నష్టం వాటిల్లుతుందని అన్నారు.