గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమ చారి, మండల కన్వీనర్ ఆనంద్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. కెరమెరి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అన్ని గ్రామ పంచాయతీలలో కార్మికులకు యూనిఫామ్స్, సబ్బులు, నూనెలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.