కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి బుధవారం కడప వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు గ్రాండ్ సక్సెసన్నారు. జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు.పోరుకు వెళ్లదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినా నాయకులు, క్యాడర్ లెక్క చేయలేదని,ప్రతి చోటా వందలాది మంది గా పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో అద్వాన్నమైన పాలన సాగుతోందని తెలిపారు.