శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో జాతీయ రహదారుల విస్తరణకు భూ సేకరణ సోలార్ పార్కులు ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ అభ్యంతరాలు, లీగల్ క్లియరెన్స్ ప్రక్రియలను పెండింగ్ లో లేకుండా పూర్తి చేయాలన్నారు.