తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (MIS) నిధులు వెంటనే జమ చేయాలని మాజీ లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. పరిశ్రమలు ప్రభుత్వ ఆదేశాలను పాటించక రైతులకు 4–6 రూపాయలకే చెల్లింపులు చేస్తున్నారని, ప్రతి కిలోకు రైతులు రూ.4 నష్టం ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 వేలమంది మామిడి రైతులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.