గుత్తిఆర్ఎస్ లోని రైల్వే క్వార్టర్స్ లో నివాసముండే రైల్వే ఉద్యోగి హరి భార్య శిరీష (32) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త హరి డ్యూటీ కి వెళ్ళాడు. అరగంటలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే గుత్తి ఆర్ఎస్ రైల్వే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.