విజయవాడ కృష్ణా నదిలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణపతి విగ్రహాలను వైభవంగా, కోలాహలంగా తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం కోసం రెండు క్రేన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, నిరంతరం డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.