ములుగు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నేడు గురువారం రోజున ఉదయం 8 గంటలకు మున్సిపాలిటీ సిబ్బంది ధర్నా కార్యక్రమం చేపట్టారు. మాధవరావు పల్లి కి చెందిన మైదం మహేష్ అనే మున్సిపాలిటీ సిబ్బంది గత 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో మనస్థాపానికి గురై మొన్న రాత్రి క్రిమిసంహారకమందు సేవించి మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబానికి న్యాయం చేయాలని, మహేష్ మృతికి కారకుల పై చర్యలు తీసుకోవాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు.