ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. VHPS మరియు CHPS ఆధ్వర్యంలో తలపెట్టిన చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు నేడు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు అడ్డుకున్నారు. దీంతో నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగగా ఎమ్మార్పీఎస్ నాయకుడు నెమలి నర్సయ్య మాదిగ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కొందరు నాయకులు గేటు దూకే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.