రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని జనసేన కార్యకర్త ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంలో గొల్లప్రోలు మండలానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమీక్ష సమావేశంలో తుమ్మల బాబు. మర్రెడ్డి శ్రీనివాసరావు పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు.