వెంకటాపురం మండలంలోని భోదాపురం- సూరవీడు గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఇసుక లారీలను ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నిలపడంతో ద్విచక్ర వాహనం సైతం వెల్లలేని దుస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు దృష్టి పెట్టి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు.