కాగజ్ నగర్ పట్టణంలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. పెద్దవాకు వద్ద నిమజ్జనం ప్రదేశాన్ని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి పరిశీలించారు. శోభాయాత్ర వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు,