కోడుమూరు పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన బోయ భాస్కర్ (20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు భాస్కర్ గౌండ పని చేస్తున్నాడు. అయితే ప్రతిరోజు మద్యం తాగుతూ బానిసయ్యాడు. భాస్కర్ ను తల్లి మందలించినా మానుకోలేదు. సోమవారం ఉదయానే మద్యం తెచ్చుకుని ఇంటి వద్ద తాగుతుండగా తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన భాస్కర్ పక్కనే ఉన్న గుడిసెలో చీరతో ఉరివేసుకుని తనువు చాలించాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.