దిలావర్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఆరోగ్య సిబ్బంది డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం నీటి కొరకు వాడే బ్యాంకులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. లేదంటే ఫంగస్ పెరిగి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. దానితోపాటు దోమలు వృద్ధి చెంది అనారోగ్యాలకు కారణం అవుతాయని పేర్కొన్నారు. ఏఎన్ఎం పుష్ప, ఆశాలు ఉన్నారు.