నారాయణపేట జిల్లాలోని కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రంలోని మిగతా ఆరోగ్య కేంద్రాలకు ఆదర్శంగా నిలవాలని స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి క్రిస్టినా చౌంగ్తు అన్నారు. కోస్గి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం అందాజా 12 గం సమయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి ఆమె సందర్శించారు.