పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపింది . పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారనీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ...