ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రజల వద్ద నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలు అన్నిటిని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. అత్యధికంగా భూవివాదాలపైనే అర్జీలు వచ్చినట్లుగా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.