చిత్తూరు: సుజుకి షోరూం భవనం కూల్చివేత చిత్తూరులో హైవే రోడ్డు 100 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో భాగంగా నగరపాలక సంస్థ ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుజుకి ప్రైవేట్ కంపెనీ భవనాన్ని కూల్చివేత ప్రారంభించారు. భవన యజమాని ముందస్తు అనుమతి తీసుకుని కూల్చివేత ప్రారంభించినట్లు ఏసీపీ తెలిపారు. నగరం అభివృద్ధి చెందాలంటే రోడ్ల వెడల్పు జరగాలన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.