ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి సంపత్ కుమార్ బుధవారం తెలిపారు.అత్యధికంగా సిర్పూర్ యూలో 9.7మీ.మీ వర్షపాతం నమోదు కాగా జైనూర్ లో 9.3,లింగాపూర్ 8.5,తిర్యాణి 6.1, రెబ్బెన 6.0,కెరమెరిలో 4.4, ఆసిఫాబాద్ లో 6.1, వాంకిడిలో 5.6, కాగజ్ నగర్ 7.0, సిర్పూర్ టి 7.8, కౌటాల 5.0,చింతలమానేపల్లి 6.6, బెజ్జూర్ లో7.6,పెంచికల్ పెట్8.0, దహేగాంలో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.