నాగలాపురంలో నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్య నాగలాపురం పంచాయతీ వినోబా నగర్ గ్రామంలో ఐదు రోజులపాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఆదివారం నిమజ్జనానికి బయలుదేరాడు. యువత, పెద్దలు డప్పుల మోతల మధ్య డాన్సులు వేస్తూ ఉత్సాహంగా వినాయక విగ్రహాలను గ్రామోత్సవంలో ఊరేగించారు. గ్రామోత్సవంలో భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. పూజలు అందుకున్న మూడు వినాయక విగ్రహాలను నాగలాపురం ఎర్ర చెరువులో నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.