కలికిరి మండల వ్యవసాయ అధికారిణి హేమలత సోమవారం ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని అలీ ట్రేడర్స్, మేడికుర్తి గ్రామంలోని నవాబ్ జాన్ ఫర్టిలైజర్స్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లు, బిల్ బుక్స్, ఈ పోస్ మెషిన్ లో వున్న స్టాక్, భౌతికంగా దుకాణం మరియు గోడౌన్ లో వున్న స్టాక్ లను పరిశీలించారు.అలాగే ఎరువుల ధరలు వున్న పట్టికను షాపు బయట రైతులకు కనపడే విధంగా డిస్ప్లే చేయాలని, ధరలకంటే ఎక్కువ అమ్మినా ,నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా చర్యలు తప్పవని,లైసెన్స్ సస్పెండ్ చేసి,షాప్ లు సీజ్ చేస్తామని ఏదో హేమలత హెచ్చరించారు