కొరిశపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు విలువల విద్య, లైబ్రరీ బుక్స్ వచ్చినట్లు ఎంఈఓ పున్నయ్య శుక్రవారం తెలియజేశారు. వాటిని ఆయా గ్రామాలలోని పాఠశాలలకు పంపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ పుస్తకాలను చదివి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పున్నయ్య తెలియజేశారు.