గుడివాడ నెహ్రూ చౌక్లో ఉన్న 'మన గ్రోమోర్ ఫెర్టిలైజర్స్' కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు యూరియా సరఫరా జరుగుతున్న తీరును పరిశీలించారు. గత సంవత్సరం ఆగస్టు నాటికి 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఈ సంవత్సరం కూడా అంతే యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.