జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బండ శంకర్ సామజిక సేవలో గత కొన్నేళ్లుగా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందరి చేత ప్రశంసలు పొందారు. జనని స్వచ్చంద సేవ సంస్థ ను స్థాపించిన అయన ప్రమాదాల బారిన పడిన నిస్సహాయులకు అవసరమైన రక్తదానం చేపించడంలో అందరికన్నా ముందు వరుసలో నిలిచారనడంలో ఎలాంటి అతిషయోక్తి లేదు.ఊరు, పేరు, గుర్తింపు లేకుండా మృతి చెందిన ఎందరో అనాధ శవాలకు పెద్ద కొడుకయ్యి దహన సంస్కారాలు నిర్వహించి తన ఔధర్యం ను చాటుకున్నారు. పంజాబ్ లోని చంధిఘడ్ లో గల రాడిషన్ హోటల్ లో పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారియా చేతుల మీదుగా మైత్రి పీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు పం