సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదివారం రాత్రికి పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు.