రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.జిల్లా కేంద్రంలోని BSNLఆఫీస్ వద్ద ఉన్న బస్ స్టాప్ లో ఉదయం రక్తపు మడుగుల్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు ఒక్కరిగా ఉలిక్కిపడ్డారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు జనగామ మండలంలోని పెద్దపహాడ్ గ్రామానికి చెందిన తాళ్ల సిద్ధులుగా గుర్తించారు.మృతుడు మేస్త్రిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.