Download Now Banner

This browser does not support the video element.

ములుగు: తొలగించిన 3 వార్డు స్థానాలను కొనసాగించాలని: MRO, MPDO, కార్యదర్శిలకు వినతి అందజేసిన కొండాయి వాసులు

Mulug, Mulugu | Aug 29, 2025
తొలగించిన వార్డు మెంబర్ల స్థానాలను మళ్లీ కొనసాగించాలని ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్థులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఎంపీడీవో శ్రీనివాస్, తాసిల్దార్ జగదీష్, కార్యదర్శి సతీష్ లకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కొండాయి, మల్యాల, దొడ్ల, దొడ్ల కొత్తూరు గ్రామాల్లో 3 వార్డులు ఉండగా, గత ఎన్నికల్లో వాటిని తొలగించారన్నారు. తిరిగి వార్డులను కొనసాగించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us