గురువారం రోజున కీసర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ సమన్వయ సమావేశాలు నిర్వహించారూ. జిల్లా కలెక్టర్ మన చౌదరి ఆదేశాల మేరకు నాగారంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని భక్తులకు సూచించారు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.